పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

6 Jun, 2021 15:49 IST|Sakshi

రేపే ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త పోర్టల్ ప్రారంభం  

ఆదాయపు పన్ను శాఖ అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా రేపు (జూన్ 7) కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) లాంచ్ చేయబోతుంది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ రూపొందిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. పోర్టల్ తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఈ పోర్టల్ తీసుకొస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది.

ఆదాయ‌పు ప‌న్ను పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉండే అన్ని ముఖ్య‌మైన‌ ఫీచ‌ర్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో మొబైల్ నెట్‌వ‌ర్క్‌తో ఎప్పుడైనా, ఎక్క‌డైనా యాప్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. దీని వల్ల పన్ను సంబందిత విషయాల్లో అవగాహన లేని వారు కూడా సులభంగా పన్ను చెల్లించేలా రూపోదించినట్లు పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ఇక నుంచి ధాఖలు చేయడం సులభం. ఐటీఆర్ 1, 4 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ఐటీఆర్ 2(ఆఫ్‌లైన్) కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయపడేలా ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఉచిత ఐటీఆర్ తయారీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది.  పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు త్వరగా స్పందించడానికి కొత్త కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వీటితో పాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న ప్రారంభం అవుతుందని సీబీడీటీ తెలిపింది. ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఆదాయపు పన్ను శాఖ వివరించింది.

చదవండి: 

Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా?

మరిన్ని వార్తలు