పేటిఎమ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న మిలీనియల్స్‌

12 Jan, 2022 20:35 IST|Sakshi

పేటిఎమ్ మనీలో పెట్టుబడి పెట్టే మిలీనియల్స్‌ పెట్టుబడిదారుల సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. పేటిఎమ్ మనీ తన వార్షిక నివేదిక 2021ను విడుదల చేసింది. 2021లో పేటిఎమ్ మొత్తం వాటాలో మిలీనియల్స్‌ పెట్టుబడిదారులు దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నారు. పేటిఎమ్ బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇటీవల 2021 పేటిఎమ్ మనీ వార్షిక నివేదికను ప్రచురించింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఒలు), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పిఎస్)తో సహా పేటిఎమ్ మనీ అందించే వివిధ ఉత్పత్తుల్లో పెట్టుబడులను ఈ నివేదిక వెల్లడించింది.

2021లో పేటిఎమ్ మనీలో ఎక్కువగా మిలీనియల్స్‌ పెట్టుబడులు పెట్టారని నివేదిక పేర్కొంది. ఈటిఎఫ్ లను కొనుగోలు చేసే మిలీనియల్స్‌ నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. మిలీనియల్స్ కొనుగోలు చేసిన ఈటిఎఫ్ సగటు సంఖ్య 50 శాతం పెరిగింది. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే మిలీనియల్స్‌ నిష్పత్తి పరంగా సుమారు 11 శాతం పెరిగారు. 2020లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వారితో పోలిస్తే 2021లో 35 శాతం పెరిగారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం అనేక మంది మిలీనియల్స్‌ ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెడుతున్నారు. మహిళా పెట్టుబడిదారుల సంఖ్య 2020 కంటే రెట్టింపు అయింది. పెట్టుబడి పెట్టె మహిళల శాతం 114 వరకు పెరిగింది. దీనికి అదనంగా, ఎక్కువ శాతం మహిళా పెట్టుబడిదారులు పురుషల కంటే అధిక లాభాన్ని 2021లో సంపాదించారు.

మిలీనియల్స్ అంటే?
1981-1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ప్రపంచదేశాలతో పోలిస్తే ఆ జనాభా మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. మొత్తం దేశ జనాభాలో వీరి సంఖ్య 400 మిలియన్లు (40 కోట్లు) ఉంటుంది.

(చదవండి: Gold price: మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌..!)

మరిన్ని వార్తలు