Neeraj Chopra: అప్పుడేమో రాహుల్‌ ద్రావిడ్‌..ఇప్పుడు నీరజ్‌ చోప్రా..! సరికొత్త రూపంలో..

20 Sep, 2021 18:21 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్‌ దూసుకుపోయాడు. అదే స్థాయిలో నీరజ్‌చోప్రా సోషల్‌మీడియా వాల్యూయేషన్‌ ఏకంగా రూ. 428 కోట్లకు పెరిగిందని ప్రముఖ రీసెర్చ్‌ కన్సెల్టెన్సీ యూగోవ్‌  వెల్లడించింది.  బంగారు పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను  బ్రాండింగ్‌ చేయడం కోసం క్యూ కట్టాయి.  
చదవండి: ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్‌ చోప్రా..!

తాజాగా నీరజ్‌చోప్రా ఐపీఎల్‌-14 యాడ్స్‌లో తళ్లుక్కున మెరిశాడు. 23 ఏళ్ల జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ ప్రముఖ ఇండియన్‌ ఫిన్‌టెక్‌ కంపెనీ క్రెడ్‌ రూపొందించిన యాడ్స్‌లో కన్పించాడు. ఈ యాడ్‌లో భాగంగా నీరజ్‌ చోప్రా.. రిపోర్టర్‌గా, మార్కెటింగ్‌ మెనేజర్‌, బ్యాంక్‌ ఉద్యోగి, స్పోర్ట్‌ పర్సన్‌, డైరక్టర్‌గా వివిధ పాత్రల్లో కన్పించాడు. ఐపీఎల్‌ 2021 ద్వితీయార్థంలో క్రెడ్‌ ‘గ్రేట్‌ ఫర్‌ ది గుడ్‌ క్యాంపెయిన్‌’ పేరిట ఈ యాడ్‌ను రూపొందించింది. క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించడం కోసం క్రెడ్‌ ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా ఈ యాడ్‌ను చూసిన నెటిజన్లు నీరజ్‌ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలోనే కాదు..యాక్టింగ్‌లో కూడా గోల్డ్‌ మెడల్‌ కొట్టేశావని నెటిజన్లు పేర్కొన్కారు. 

గతంలో ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌, మధూరి దిక్షిత్‌, గోవిందా, బప్పి లహరీ, ఉదిత్‌ నారాయణ, అల్కా యగ్నిక్‌తో కలిసి యాడ్స్‌ను క్రెడ్‌ రూపోందించింది. కొన్ని రోజుల క్రితం ఎప్పుడు కూల్‌గా ఉంటే భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ను ‘ఇందిరానగర్‌ కా గుండా’ రూపంలో యాడ్‌ను రూపొందించింది. క్రెడ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా మాట్లాడుతూ...ఐపీఎల్‌తో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు.  బాధ్యదాయుతమైనా ఆర్థిక ప్రవర్తను ప్రజల్లో తీసుకరావడానికి క్రెడ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

చదవండి: నీరజ్‌ చోప్రా సోషల్‌మీడియా వాల్యుయేషన్‌ ఏకంగా రూ. 428 కోట్లు..!


 

మరిన్ని వార్తలు