ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్‌ చోప్రా..!

14 Sep, 2021 22:23 IST|Sakshi

Neeraj Chopra Social Media Valuation: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. జావెలింగ్‌ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా భారత్‌కు సరికొత్త పతకాన్ని సాధించి రికార్డును నెలకొల్పాడు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్‌ దూసుకుపోయాడు. బంగార పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను  బ్రాండింగ్‌ చేయడం కోసం క్యూ కట్టాయి.  

వాల్యూయేషన్‌లో నీరజ్‌ హవా...!
23 ఏళ్ల నీరజ్‌ చోప్రా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యాన్ని పొందాడు. చోప్రా ఒలింపిక్ గోల్డ్ గెలిచిన రోజు నుంచి సోషల్‌, డిజిటల్ మీడియా రంగంలో అతడి వాల్యూ విపరీతంగా పెరిగింది. రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం... ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌ మెన్షన్‌ పర్సన్‌గా నీరజ్‌  నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 2.9 మిలియన్ల యూజర్లు నీరజ్‌ గురించి ప్రస్తావించారు. డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో నీరజ్‌ ప్రస్తావన సుమారు 2055 శాతంగా ఉంది. దీంతో నీరజ్‌ చోప్రా సోషల్ మీడియా వాల్యుయేషన్‌ ఏకంగా 428 కోట్లకు పెరిగింది.

సాధారణ ఇండియన్‌ అథ్లెట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ..!
నీరజ్‌ చోప్రాకు జెఎస్‌డబ్ల్యూ స్పోర్ట్‌ తన మద్దతును అందిస్తోంది. ప్రస్తుతం జెఎస్‌డబ్ల్యూ నీరజ్‌ చోప్రాకు దీర్ఘకాలిక సహకారాన్ని అందించాలని చూస్తోంది. పలు ఇతర బ్రాండ్లు కూడా నీరజ్‌ చోప్రాపై ఆసక్తి కనబరుస్తున్నాయి. యూగోవ్‌ స్పోర్ట్‌ నివేదిక ప్రకారం, గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుంచి నీరజ్‌ చోప్రా సోషల్ మీడియాలో ఇంటారక్షన్స్‌ సుమారు  86.3శాతం చొప్పున 12.79 మిలియన్లకు పెరిగింది. రికార్డుస్థాయిలో 4.05 మిలియన్ల మేర వీడియో ఎంగేజ్‌మెంట్‌ ఇంటారక్షన్స్‌ నమోదయ్యాయి. ఇది సోషల్ మీడియాలో దిగ్గజ ఇండియన్ అథ్లెట్ల సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. నీరజ్ చోప్రా ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇంటరాక్షన్‌లో కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లను దాటేశాడు. సహజంగానే, నీరజ్ చోప్రా సోషల్‌మీడియా ఖాతాల అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగింది, అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఇప్పుడు 4.4 మిలియన్లుగా నమోదైంది, ఫాలోవర్స్‌లో 2297శాతం మేర పెరుగుదలను సూచిస్తోంది. 

మరిన్ని వార్తలు