ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా

10 Aug, 2021 12:46 IST|Sakshi

సుదీర్ఘ కాలం తరువాత ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కంగారు పడకండి . నీరజ్‌ చోప్రో ఏంటీ? ప్రజలకు వార్నింగ్‌ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? 

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువైపోయాయి. ట్రాన్సాక్షన్ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు బాధితులకు పెద్ద ఎత్తున కుచ్చిటోపీ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్‌ వీరుడు నీరజ్‌ చోప్రోతో కలిసి డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ పై అవగాహన పెంచేందుక ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ నీరజ్‌ చోప్రో వీడియోలో మాట్లాడారు. అంతేకాదు  పిన్‌, ఓటీపీ, బ్యాంక్‌ అకౌంట్లను జాగ్రత్త ఉంచుకోవాలని కోరారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను  ఎప్పటికప్పుడు మార్చుకోవాలని ఏటీఎం,క్రెడిట్ కార్డ్ల్‌లను పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్‌ చేయాలని కోరుతూ ముగించాడు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లతో పాటు మిగిలిన బ్యాంక్‌లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు