ఇండియా నుంచి వందో యూనికార్న్‌..ఎక్కడో తెలుసా?

3 May, 2022 15:28 IST|Sakshi

యంగ్‌ ఎంట్రప్యూనర్లు ఇండియాలో పెరిగిపోతున్నారు. సంప్రదాయ వ్యాపార వాణిజ్య విధానాలకు టెక్నాలజీ హంగులు అద్దుతూ కొత్త కంపెనీలకు శ్రీకారం చుడుతున్నారు. పదేళ్ల కిందట మొదలై ఈ ట్రెండ్‌ ఇప్పుడు వేగంగా ముందుకు పోతుంది. ఈ క్రమంలో ఇండియా నుంచి మరో స్టార్టప్‌ యూనికార్న్‌ హోదాను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు వంద స్టార్టప్‌లు యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయి. 

బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్‌ స్టార్టప్‌ ఓపెన్‌ యూనికార్న్‌ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు సాధించింది. ఇటీవల జరిగిన ఫండ్‌ రైజింగ్‌ రౌండ్‌లో సింగపూర్‌కి చెందిన వెల్త్‌ ఫండ్‌ టెమాసెక్‌, యూఎస్‌ హెడ్జ్‌ ఫండ్‌ టైగర్‌ గ్లోబల్‌, 3 వన్‌ 4 క్యాపిటల్‌ సంస్థలు 50 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుకు ముందుకు వచ్చాయి. దీంతో ఓపెన్‌ మార్కెట్‌ వాల్యుయేషన్‌ వన్‌ బిలియన్‌ డాలర్ల మార్క్‌ను టచ్‌ చేసింది. దీంతో యూనికార్న్‌ హోదాను దక్కించుకున్న వందో స్టార్టప్‌గా రికార్డులకెక్కింది.

నియోబ్యాంకింగ్‌ స్టార్టప్‌ ఓపెన్‌ అందిస్తోన్న ఓపెన్‌ ఫ్లో, ఓపెన్‌ సెటిల్‌, ఓపెన్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌కి ఆదరణ పెరుగుతుండటంతో నిధుల సమీకరణ సులువైంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఐడియాస్‌, ఇన్నోవేషన్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్ని కలిపితే ఇండియా అంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు.

చదవండి: అక్షయ తృతీయ.. ‘నగ’ ధగలు!

మరిన్ని వార్తలు