ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి

25 Sep, 2021 03:16 IST|Sakshi

సెప్టెంబర్‌ 22 నాటికి రూ.5,70,568 కోట్లు

కరోనా ముందస్తు కాలంతో పోల్చినా 27 శాతం అధికం

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్‌) సెపె్టంబర్‌ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్‌ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్‌ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) తాజాగా  విడుదల చేసిన గణాంకాల్లో  ముఖ్యాంశాలు...

► ఏప్రిల్‌–1 నుంచి సెపె్టంబర్‌ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం  (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు.  
► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్‌ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు.  
     ఇప్పటివరకూ రిఫండ్స్‌ రూ.75,111 కోట్లు. 

మరిన్ని వార్తలు