హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 5శాతం డౌన్‌

30 Jul, 2020 16:35 IST|Sakshi

స్వల్పంగా పెరిగిన మొత్తం ఆదాయం 

3.50శాతం నష్టంతో ముగిసిన షేరు

దేశీయ అతిపెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ గురువారం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటేడ్ నికరలాభం జూన్‌ కార్వర్ట్‌లో 15శాతం పెరిగింది.కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం మాత్రం రూ.23,239 కోట్ల నుంచి రూ.29,959 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం  5శాతం క్షీణించి రూ.3052 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండ్‌లోన్‌ ఆదాయం రూ.12,990 నుంచి రూ.13,017 కోట్లకు పెరిగింది. ఇదే క్యూ1లో నికర వడ్డీ మార్జిన్‌ 3.3శాతం నుంచి 3.1శాతానికి తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కోవిడ్‌-19 సంబంధిత కేటాయింపులు రూ.1199 కోట్ల మేరకు జరిపినట్లు కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,079 కోట్ల నుంచి 10శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరింది. వ్యక్తిగత రుణఖాతాదారుల్లో 2శాతం మంది, కార్పోరేట్‌ రుణగ్రస్తుల్లో 2శాతం కంపెనీలు మారిటోరియంను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు శుక్రవారం నష్టంతో 3.50శాతం రూ.1811 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు