Netflix: ఓటీటీలో సినిమా, వెబ్‌సిరీస్‌లేకాదు..గేమ్స్‌ కూడా..!

29 Sep, 2021 17:25 IST|Sakshi

కరోనా రాకతో ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదేస్థాయిలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే వారి సంఖ్య కూడా భారీగా వృద్ది చెందింది. దీంతో ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీ సంస్థలు దృష్టిసారించాయి. గతంలో నెట్‌ఫ్లిక్స్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ను కూడా తీసుకువస్తోదనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రముఖ గేమింగ్‌ దిగ్గజం నైట్‌ స్కూల్‌ స్టూడియోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైట్‌ స్కూల్‌ స్టూడియోకు చెందిన ఐదు మొబైల్‌ గేమ్స్‌ను యూరోపియన్‌ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది. 
చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..!

నైట్ స్కూల్ స్టూడియో అభివృద్ధిపరిచిన తొలి గేమ్‌ ‘ఆక్సెన్‌ఫ్రీ’ వీడియో గేమ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. సోనీ ప్లేస్టేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్‌, నింటెండో స్విచ్ , కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న నైట్‌ స్కూల్‌ స్టూడియో గేమ్స్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి తొలి సారిగా మొబైల్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో గేమ్స్‌ను లాంచ్‌ చేసింది.నెట్‌ఫ్లిక్స్‌ సభ్యత్వం ఉన్న వారికి యాప్‌లో ఎలాంటి కొనుగోలు లేకుండా, యాడ్స్‌ లేకుండా యూజర్లు గేమ్స్‌ను ఆడుకోవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

స్పెయిన్ ,ఇటలీలోని నెట్‌ఫ్లిక్స్ సభ్యులకు ఆండ్రాయిడ్‌లో "స్ట్రేంజర్ థింగ్స్: 1984", "స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్", "కార్డ్ బ్లాస్ట్", "టీటర్ అప్" "షూటింగ్ హూప్స్" గేమింగ్‌ టైటిళ్లను ఇప్పటికే  ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ సదుపాయం త్వరలోనే భారత్‌లోను లాంచ్‌ చేసేందుకు ప్రయత్నాలను చేస్తోన్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.  స్ట్రీమింగ్ స్పేస్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆదాయవనరులను పెంచుకునేందుకుగాను గేమింగ్‌ రంగంపై నెట్‌ఫ్లిక్‌ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 
చదవండి: వర్క్‌ వాట్‌ వర్క్స్‌ పాలసీ.. ఎంప్లాయిస్‌ ఫుల్‌ హ్యాపీ

మరిన్ని వార్తలు