నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్‌.. మొబైల్‌ గేమ్స్‌.. ఆడటం ఎలా?

8 Nov, 2021 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓవర్‌ ద టాప్‌ మీడియా సేవల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ గేమ్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌ పీసీ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ముందుగా అయిదు గేమ్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ చందాదారులైతే చాలు. ఎటువంటి ప్రకటనలు, అదనపు రుసుం, ఖర్చులు లేవని కంపెనీ తెలిపింది. చాలా భాషల్లో ఈ గేమ్స్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. పిల్లల ప్రొఫైల్స్‌కు ఇవి అందుబాటులో ఉండవని వివరించింది.  

గేమ్స్‌ ఇవే
ది స్ట్రేంజర్‌ థింగ్స్‌:1984 (బోనస్‌ ఎక్స్‌పీ)
స్ట్రేంజర్‌థింగ్స్‌ 3: ది గేమ్‌ (బోనస్‌ ఎక్స్‌పీ)
షూటింగ్‌ హూప్స్‌ (ఫ్రోస్టీ పాప్‌)
కార్డ్‌ బ్లాస్ట్‌ ( అమ్యూజో అండ్‌ రోగ్‌ గేమ్‌)
టీటర్‌ అప్‌ (ఫ్రోస్టీ పాప్‌)

గేమ్స్‌ ఆడాలంటే
ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే డివైజ్‌లో అకౌంట్‌ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ నెట్‌ఫ్లిక్స్‌ గేమ్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. వెంటనే గేమ్స్‌ హోం పేజీలోకి వెళ్తుంది. అక్కడ నచ్చిన గేమ్‌ ఆడుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌ గేమ్‌ ఆప్షన్‌ కనిపించని పక్షంలో.. కొంత కాలం ఎదురు చూడాల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌ క్రమంగా ఈ సేవలను విస్తరింపచేస్తోంది.

ఈ గేమ్స్‌ పిల్లలకు కాదు
గేమ్స్‌ అందుబాటులో ఉన్న చందాదారులు ఒకేసారి మల్టీపుల్‌ డివైజ్‌లో గేమ్స్‌ ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్స్‌ కిడ్స్‌ విభాగంలో అందుబాటులో ఉండవు. వీటిని నెట్‌ఫ్లిక్స్‌ అడల్ట్‌ కేటగిరీలోనే ఉంచింది. 

మరింతంగా
భవిష్యత్తులో గేమ్స్‌ విభాగాన్ని మరింతగా విస్తరించాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌, వెబ్‌సిరీస్‌, డాక్యుడ్రామాల తరహాలోనే గేమ్స్‌ని కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న గేమ్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
చదవండి:నెట్‌ఫ్లిక్స్‌ దశనే మార్చేసిన దక్షిణకొరియన్‌ డ్రామా..!

మరిన్ని వార్తలు