టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్‌

4 Mar, 2021 19:54 IST|Sakshi

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. టిక్‌టాక్‌కు పోటీగా "ఫాస్ట్ లాఫ్స్" యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ లో మొబైల్ యూజర్లకు కామెడీ కేటలాగ్ నుంచి ఫన్నీ క్లిప్‌లను అందిస్తుంది. అయితే ఈ ఫాస్ట్ లాఫ్స్ యాప్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది కూడా చూడటానికి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ లాగా కనిపిస్తుంది.

ప్రస్తుతానికి దీనిలో ఆసక్తి పెంచే, హాస్య సంబంధిత చిన్న వీడియోలు ఉన్నాయి. ఈ యాప్ లో కెవిన్ హార్ట్ & అలీ వంటి స్టాండ్-అప్ కమెడియన్ల స్నిప్పెట్‌లు ఉన్నాయి. ఈ కామెడీ యాక్టర్స్ వీడియో క్లిప్స్ నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా అనుసంధానమై నేరుగా ప్లే అవుతాయి. అంతేకాదు వినియోగదారులు కూడా తమకు నచ్చిన ఆసక్తి కనబరిచే వీడియోలను పోస్ట్ చేయవచ్చు అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. గత ఏడాది నుంచి దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.

చదవండి:

విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ?

2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు