భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు! ఎక్కడంటే!

15 Jan, 2022 14:23 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. యూజర్లకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. 

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కాస్ట్లీగా మారాయి. గతనెల డిసెంబర్‌ లో నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని తగ్గించింది. అయితే తాజాగా భారత్‌ను మినహాయించి యూకే, కెనడా దేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని పెంచుతున్నట్లు అధికారింగా ప్రకటించింది. ప్లాన్‌ను బట్టి యూఎస్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు ఒకడాలర్‌ నుండి రెండు డాలర్ల వరకు పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఇండియాలో నెట్‌ప్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు ఇలా ఉన్నాయి.

యూకేలో బేసిక్‌ ప్లాన్‌ వన్‌ స్క్రీన్‌ కాస్ట్‌ 9.99 డాలర్లు ఉండగా..14డాలర్లుగా ఉన్న స్టాండర్డ్‌ ప్లాన్‌ను 15.50కి పెంచింది. ఈ స్టాండర్డ్‌ ప్లాన్‌లో ఒకేసారి రెండు స్క్రీన్‌లలో లాగిన్‌ అవ్వొచ్చు. 4కే ప్లాన్ ధర 18డాలర్ల నుండి నెలకు 20కి పెంచగా.. ఇందులో ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో వీక్షించవవచ్చు.  

నెట్‌ఫ్లిక్స్ కెనడాలో తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరల్ని కూడా పెంచింది. కెనడాలో బేసిక్‌ ప్లాన్‌ 14.99 డాలర్ల నుండి 16.49కి పెంచింది. ప్రీమియం ప్లాన్ ధర 2డాలర్ల నుంచి  20.99కి పెంఇచంది. అయితే కెనడాలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధరల్ని పెంచలేదు. బేసిక్‌ ప్లాన్ ధర రూ.9.99గా ఉంది.

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ ప్యాకేజీ తగ్గింపు.. అమెజాన్‌ ప్రైమ్‌కు దెబ్బ!

>
మరిన్ని వార్తలు