నెట్‌ఫ్లిక్స్‌ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

21 Apr, 2023 17:31 IST|Sakshi

న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్‌లైన్‌లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్‌తో  హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్కామ్  ఒకటి వెలుగులో  వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా)

నెట్‌ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్‌లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు  ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్‌ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. 

యూజర్‌ ఏదైనా ఒక పేమెంట్‌ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్‌ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్‌ ఐడీనుంచి ఇమెయిల్‌ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్‌ను కూడా షేర్‌ చేస్తుంది. ఆ లింక్‌ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్‌సైట్‌కి మళ్లించి మోసానికి పాల్పడతారు. 

బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్‌ పాయింట్‌ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్‌ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా  అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్‌సైట్‌లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్‌ను సూచించే ఇతర కారకాలు వంటి  ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు  సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు.

డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి లేదా సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ఇంకా  ఎలాంటి  ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్‌ డౌన్‌, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!)

ఎలా గుర్తించాలి
ఆన్‌లైన్‌లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్‌సైట్  URLని తనిఖీ చేయాలి.
యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి.
తాజా భద్రతా ప్యాచ్‌లతో అప్‌డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి.
 

>
మరిన్ని వార్తలు