నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ ప్యాకేజీ తగ్గింపు.. అమెజాన్‌ ప్రైమ్‌కు దెబ్బ!

14 Dec, 2021 12:36 IST|Sakshi

Netflix India cuts prices across its streaming plans:  భారత్‌లో యూజర్ల కోసం సబ్‌ స్క్రిప్షన్‌ స్ట్రీమింగ్ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది.  సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను సవరిస్తూ.. తక్కువ ధరకే ప్యాకేజీలను అందించబోతోంది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య రేస్‌ రసవత్తరంగా మారనుంది.


199 రూపాయల బేసిక్‌ ప్లాన్‌ను.. కేవలం రూ. 149కే అందించనున్నట్లు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌. అంతేకాదు మిగతా ప్యాకేజీలకు సైతం సవరణలు ఇచ్చింది.  2016లో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో అడుగుపెట్టగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాకేజీ రేట్లను తగ్గించడం విశేషం.  మరోవైపు అమెజాన్‌ ప్రైమ్‌  149రూ. ప్లాన్‌ను.. 199కి పెంచిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ అదే మంత్లీ ప్లాన్‌ను 50రూ.  మేర తగ్గించడం విశేషం.  


 
మొబైల్‌ ప్లాన్‌లో భాగంగా.. 149రూ. సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్‌లో  సింగిల్‌ మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌లలో 480p(852×480 pixels) రెజల్యూషన్‌తో వీడియోలను వీక్షించొచ్చు. 

ఇక బేసిక్‌ ప్లాన్‌లో 199రూ. సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్‌లో  సింగిల్‌ మొబైల్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌, టీవీలలో ఒకేసారి చూడొచ్చు. ఇంతకు ముందు ఈ ఆఫ్షన్‌ 499రూ. ఉండేది. 

స్టాండర్డ్‌ ప్లాన్‌ 1080p క్వాలిటీతో 499రూ. (ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్‌ల్లో సైతం వీక్షించొచ్చు), .. ఇది ఇంతకు 649రూ. ప్లాన్‌లో అందించింది నెట్‌ఫ్లిక్స్‌.  

ప్రీమియం ప్లాన్‌లో బెస్ట్‌ 4కే ఫ్లస్‌ హెడ్‌డీఆర్‌ క్వాలిటీ కోసం 649రూ. ప్యాకేజీలు ఉన్నాయి.  ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి నాలుగు వేర్వేరు డివైజ్‌లలో వీక్షించొచ్చు.


ఇప్పటికే ఉన్న యూజర్లకు అప్‌గ్రేడ్‌ ఫీచర్‌ను ఇవాళ్టి(మంగళవారం, డిసెంబర్‌ 14 2021) అందించనున్నట్లు తెలుస్తోంది.  ఉదాహరణకు, మీరు బేసిక్ ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉంటే, మీరు అప్‌గ్రేడ్‌ను తిరస్కరించవచ్చు మరియు కొత్త ప్లాన్‌ను తగ్గింపు ధరలకు పొందవచ్చు.

క్వాలిటీ  స్ట్రీమింగ్ సర్వీస్‌ ఓటీటీగా పేరున్న నెట్‌ఫ్లిక్స్‌.. అధిక ప్యాకేజీల పట్ల ఇంతకాలం యూజర్లలో అసంతృప్తి ఉండేది. అయితే తాజా నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరికొందరు యూజర్లు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక సరిగ్గా అమెజాన్‌ ధరల పెంచిన టైంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. 

చదవండి: నెట్‌ప్లిక్స్‌ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..!

మరిన్ని వార్తలు