వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌!

26 Jun, 2022 15:34 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉండడం, పాస్‌వర్డ్‌ షేరింగ్‌ అదనపు ఛార్జీలు వసూలు చేస‍్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష‍్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్‌ఫ్లిక్స్‌ అంచానా వేసింది. ఈ తరుణంలో వినియోగారుల్ని తిరిగి రప్పించుకునేందుకు సరికొత్త బిజినెస్‌ స్ట్రాటజీతో నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు రానుంది. 

వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. త్వరలో తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను అందించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్న చందాన..సబ్‌ స్క్రిప్షన్‌ ధరల్ని తగ్గించి..యాడ్‌ టైర్‌ ప్లాన్‌ను యాడ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్‌ కో- సీఈవో టెడ్‌ సారండోస్‌ తెలిపారు. తద్వారా నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలు చూసే సమయంలో యాడ్స్‌ ప్రసారం అవుతాయి. యాడ్స్‌ ప్రసారంతో సంస్థకు లాభాలు..సబ్‌స్క్రిప్షన్‌ ధరల తగ్గింపుతో చేజారిపోయిన సబ్‌స్క్రైబర్లను పెంచుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో టెడ్‌ సారండోస్‌ మాట్లాడుతూ.." నాకెందుకో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. ఓటీటీ వీడియోల్లో యాడ్స్‌ ప్లే అయితే పెద్దగా పట్టించుకోను. కానీ సబ్‌స్క్రిప్షన్‌ ధర తక్కువగా ఉండాలి" అని అనుకునే యూజర్ల కోసం కొత్త యాడ్‌ టైర్‌ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు