ఐఫోన్‌ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..

22 Sep, 2023 22:17 IST|Sakshi

Complaints on iphone 15: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యాపిల్‌ (apple) ఐఫోన్‌ 15 (iphone 15) సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు మొదలైన కొన్ని గంటల్లోనే కొత్త ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిజైన్, సాంకేతిక సమస్యలపై కంప్లైంట్లు వచ్చాయి. 

కొత్త ఐఫోన్‌ మన్నిక పరీక్షలలో పేలవంగా పని చేసిందని, అసమాన రంగులు, ఇతర లోపాలను కలిగి ఉందని టెక్ ఔత్సాహికులు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి. ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్‌ల వద్ద వందలాది మంది క్యూలు కట్టారు.

“మొదటి ఐఫోన్ 15 ప్రో డ్రాప్ టెస్ట్ గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రో కంటే అధ్వాన్నమైన మన్నికను చూపుతోంది. కొత్త వంపు అంచులు స్ట్రెయిట్ ఎడ్జ్ డిజైన్ కంటే పెళుసుగా కనిపిస్తున్నాయి" ఒకరు పోస్ట్ చేశారు. 'సాఫ్ట్‌వేర్ గ్లిచ్' అని మరొక క్లిప్ ఫ్లాగ్ చేసింది. కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై గీతలు వచ్చినట్లు ఫిర్యాదు చేసింది. 

“ఐఫోన్ 15 ప్రో కొన్ని యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కలరింగ్ సమాంతరంగా లేదు. అంతేకాకుండా స్క్రీన్ అంచులతో సరిగ్గా అలైన్‌ చేయలేదు" అని ‘ఎక్స్‌’(ట్విటర్‌) యూజర్‌ షేర్ చేశారు. కొన్ని నివేదికలు కొత్త ఫోన్‌ను 'ఫింగర్‌ప్రింట్ మాగ్నెట్'గా పేర్కొన్నాయి.

మరికొందరు రంగు మార్పును తోసిపుచ్చడానికి యాపిల్ సపోర్ట్‌ కథనాన్ని ఉదహరించారు. యూజర్ల చర్మం నుంచి వచ్చే నూనె ఐఫోన్‌ 15 బాహ్య బ్యాండ్ రంగును తాత్కాలికంగా మార్చవచ్చు. ఐఫోన్‌ను కొద్దిగా తడిగా ఉన్న మెత్తని గుడ్డతో తుడవడం వల్ల అసలు రంగు వస్తుందని యాపిల్‌ కంపెనీ సపోర్ట్‌ సమాచారంలో పేర్కొంది.


 

మరిన్ని వార్తలు