మరింత విలాసవంతంగా రైలు ప్రయాణాలు..!

26 Jul, 2021 21:23 IST|Sakshi

న్యూ ఢిల్లీ: రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. త్వరలోనే సరికొత్త ‘ఎసీ ఎకానమీ' కోచ్‌లను ఇండియన్‌ రైల్వేస్‌ ప్రారంభించనుంది. కోవిడ్‌ రాకతో ఈ కోచ్‌ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఈ కోచ్‌లను కపుర్తాలా, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఎసీ 3-టైర్‌ కంటే తక్కువగా, నాస్‌ ఎసీ స్లీపర్‌ కంటే ఎక్కువగా ఎసీ ఎకానమీ కోచ్‌ ధరలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కోచ్‌ల రాకతో  ప్రయాణికులకు తక్కువ ధరలో ఎసీ ప్రయాణాలను ఇండియన్‌ రైల్వేస్‌ అందించనుంది.  కాగా ఎసీ ఎకానమీ కోచ్‌ల అధికారిక పేరును, లాంచ్‌ డేట్లను ఇండియన్‌ రైల్వేస్‌ ఇంకా నిర్ణయించలేదు. కపుర్తాలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తయారుచేసిన కోచ్‌లను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్‌ చేసినట్లు తెలుస్తోంది.  

ఎసీ ఎకానమీ కోచ్‌ల ఫీచర్లు 

  • ప్రతి కోచ్లో కనిపించే 72 బెర్తులకు బదులుగా 83 బెర్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • ప్రతి బెర్త్‌లో వ్యక్తిగత రీడింగ్ లైట్లు,  మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్‌లకు స్వంత ఎసీ వెంట్‌ల ఏర్పాటు ఉంది.
  • ప్రతి కంపార్ట్మెంట్లో ఫోల్డబుల్‌ స్నాక్‌ టేబుల్‌, వాటర్‌ బాటిళ్ల హోల్డర్లు, మ్యాగజైన్స్,  మొబైల్ ఫోన్ల హోల్డర్లను అమర్చారు. 
  • ఈ ఎసీ ఎకానమీ కోచ్‌లు దివ్యాంగులకు అనువుగా ఉంటాయి. కంపార్ట్మెంట్లకు వీల్ చైర్ యాక్సెస్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు