-

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే! ధరలు, వివరాలు ఇలా..

26 Nov, 2023 16:31 IST|Sakshi

పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650
దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది.

2024 హిమాలయన్
భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్‌గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది.

2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు.

ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె..

ఓర్క్సా  మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్‌లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు