భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు - వివరాలు

11 Mar, 2023 21:29 IST|Sakshi

భారతదేశంలో ప్రతి రోజూ ఏదో ఒక వెహికల్ ఏదో ఒక మూలన విడుదలవుతూనే ఉంది. కాగా త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్ర చేయడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ వెర్నా, ఇన్నోవా క్రిస్టా డీజిల్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త హ్యుందాయ్ వెర్నా:

హ్యుందాయ్ కంపెనీ గత కొన్ని రోజులుగా తన కొత్త వెర్నా సెడాన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా సమాచారం వెల్లడైంది. అయితే ఇది మార్చి 21న గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్:

దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఇన్నోవా క్రిస్టా త్వరలోనే డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో విడుదలకానున్నట్లు సమాచారం. ఇది 2.4 లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా ఇది అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు కూడా నివేదికల ద్వారా తెలుస్తోంది.

లెక్సస్ ఆర్ఎక్స్:

2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద కనిపించిన చాలా కార్లలో 'లెక్సస్ ఆర్ఎక్స్' ఒకటి. ఇది మొదటి చూపుతోనే ఎంతోమంది వాహనప్రేమికుల మనసు దోచింది. ఈ SUV దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది. ఇది RX 350h లగ్జరీ, RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ట్రిమ్‌లలో లభిస్తుంది. అదే సమయంలో 2.5 లీటర్, 2.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి:

సిఎన్‌జి వాహనాలను పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇప్పటికే చాలా కార్లను ఈ విభాగంలో విడుదల చేసింది. కాగా ఇప్పుడు బ్రెజ్జాను కూడా సిఎన్‌జి రూపంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది 1.5 లీటర్ కె15సి డ్యూయెల్ జెట్ ఇంజిన్‌ పొందుతుంది. ఈ కారు కూడా త్వరలో విడుదలయ్యే కొత్త కార్ల జాబితాలో ఒకటిగా ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్:

ఇక మన జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా కనిపించింది. ఈ SUV 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్‌తో విడుదల కానుంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి మరెన్నో రోజులు లేదని తెలుస్తుంది.

మరిన్ని వార్తలు