ఐషర్‌ సీఎఫ్‌వోగా విద్య శ్రీనివాసన్‌

19 Nov, 2022 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా విద్య శ్రీనివాసన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆమె బాటా ఇండియా ఫైనాన్స్‌ డైరెక్టర్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన ఆమెకు ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్‌ ప్లానింగ్, లీగల్, కమర్షియల్‌ కార్యకలాపాల్లో 24 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. ప్యూమా స్పోర్ట్స్‌ ఇండియా, ఆదిత్య బిర్లా, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ వంటి సంస్థల్లోనూ పనిచేశారు.

చదవండి: భారత్‌లో వన్‌ అండ్‌ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!

మరిన్ని వార్తలు