Banks Privatisation: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేం‍ద్రం క్లారిటీ

3 Aug, 2022 07:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వీలుగా చట్ట సవరణలతో ఎటువంటి బిల్లును వర్షాకాల సమావేశాల్లో తీసుకురావడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా చేపట్టే అంశాల అజెండాలో ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టడం, చర్చించడం, ఆమోదించడం అన్నవి లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ సభకు తెలిపారు.

2021–22 బడ్జెట్‌లో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఇలా ప్రైవేటీకరణ ప్రతిపాదనలో ఐడీబీఐ బ్యాంకు సహా మరికొన్ని ఉన్నాయి. కానీ, వీటికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఎస్‌బీఐ మినహా మరే ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై సూచనలు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.

చదవండి: క్యాష్‌ విత్‌డ్రా, శ్మశాన వాటికల జీఎస్టీపై మంత్రి నిర్మలా సీతారామన్‌ క్లారిటీ

మరిన్ని వార్తలు