అక్టోబర్‌ 10 నుంచి బడ్జెట్‌ కసరత్తు.. ముందున్న కీలక సవాళ్లు

8 Sep, 2022 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వశాఖ అక్టోబర్‌ 10 వ తేదీ నుంచి 2023–24 బడ్జెట్‌ రూపకల్పన కసరత్తును ప్రారంభించనుంది. అధిక ద్రవ్యోల్బణం, డిమాండ్‌ పెంపు, ఉపాధి కల్పన, 8 శాతం వృద్ధి బాటన ఎకానమీని నిలపడం వంటి కీలక సవాళ్లు ప్రస్తుతం కేంద్రం ముందు ఉన్నాయి. 

ఇది మోదీ 2.0 ప్రభుత్వం ఐదవ బడ్జెట్ మాత్రమే కాదు ఏప్రిల్-మే 2024లో సార్వత్రిక ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి పూర్తి బడ్జెట్. అయితే ఇప్పటి వరకు జీఎస్టీ బాదుడుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్‌లోనైనా కాస్త ఉపశమనం లభిస్తుందో లేదో చూడాలి.

చదవండి: iPhone14: స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె సెటైర్లు, ఏమైంది?

మరిన్ని వార్తలు