వ్యాపార నిర్వహణ సులభతరం కోసం త్వరలో బిల్లు

2 Oct, 2022 09:24 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. ఇందులో భాగంగా నిర్దిష్ట చర్యలను నేరం కింద పరిగణించే కొన్ని నిబంధనలను సవరించేలా కొత్త బిల్లుపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. దీన్ని రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

నిబంధనల భారాన్ని తగ్గించేందుకు పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన సూచించారు. పీహెచ్‌డీసీసీఐ వార్షిక సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా గోయల్‌ ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని భారత్‌ కొంత మేర అదుపులో ఉంచగలుగుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలోనూ భారత ఎకానమీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని గోయల్‌ వివరించారు.

చదవండి: Telangana: పాస్‌పోర్టు కావాలా.. ఇప్పుడంత ఈజీగా రాదండోయ్‌!
 
   

మరిన్ని వార్తలు