వాయిస్‌ అసిస్ట్‌తో జూపిటర్‌

16 Mar, 2022 08:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ స్మార్ట్‌ ఫీచర్స్‌తో జూపిటర్‌ జడ్‌ఎక్స్‌ను ప్రవేశపెట్టింది. బ్లూటూత్, వాయిస్‌ అసిస్ట్, డిజిటల్‌ కన్సోల్, నావిగేషన్‌ అసిస్ట్, ఎస్‌ఎంఎస్, కాల్‌ అలర్ట్‌ ఫీచర్లను జోడించింది. 110 సీసీ స్కూటర్స్‌ విభాగంలో వాయిస్‌ అసిస్ట్‌ పొందుపర్చడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. 

ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.80,973 ఉంది. డ్యూయల్‌ టోన్‌ సీట్, బ్యాక్‌రెస్ట్, 7,500 ఆర్‌పీఎంతో 5.8 కిలోవాట్‌ అవర్‌ పవర్, 5,500 ఆర్‌పీఎంతో 8.8 ఎన్‌ఎం టార్క్, ఇంటెలిగో టెక్నాలజీ, ఐ–టచ్‌స్టార్ట్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, మొబైల్‌ చార్జర్, 21 లీటర్‌ స్టోరేజ్, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ వంటి హంగులు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు