సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది

10 Mar, 2023 19:55 IST|Sakshi

హ్యుందాయ్ సెకండ్ జనరేషన్ కోనా ఎలక్ట్రిక్ కారు మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇప్పటికే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ వెల్లడించింది. కాగా ఇప్పుడు పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను గురించి చెప్పుకొచ్చింది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 48.4kWh బ్యాటరీ, ఇది 153 హెచ్‌పి 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 65.4kWh బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 215 హెచ్‌పి మరియు 255 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భారతదేశంలో 39.2kWh బ్యాటరీ ప్యాక్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

రేంజ్ విషయానికి వస్తే లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 490 కిమీ పరిధిని అందిస్తుందని సమాచారం. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంటుంది. అయితే ఖచ్చితమైన రేంజ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు పరిధి వాస్తవ ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది.

(ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు.. దుమ్మురేపిన ఫిబ్రవరి సేల్స్)

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్లిమ్ ర్యాప్‌రౌండ్ ఫ్రంట్ లైట్ బార్, క్లామ్‌షెల్ బానెట్, ముందు & వెనుక వైపు ఫంక్షనల్ ఎయిర్ ఇన్‌టేక్స్, గ్రిల్స్, స్కిడ్‌ప్లేట్‌ వంటి వాటిని పొందుతుంది. పరిమాణం పరంగా కూడా ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఆధునికంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు