రూ. 16.47 లక్షల కొత్త కవాసకి బైక్ - పూర్తి వివరాలు

14 Mar, 2023 13:42 IST|Sakshi

భారతీయ మార్కెట్లో కవాసకి ఇండియా కొత్త జెడ్900ఆర్ఎస్ (Z900RS) బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 16.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మన దేశానికీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో వస్తుంది. కావున ధర దాని మునుపటి మోడల్ ఏజ్ఎక్స్-ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది.

2023 కవాసకి జెడ్900ఆర్ఎస్ బైక్ 948 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 107 బీహెచ్‌పీ పవర్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త జెడ్900ఆర్ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్‌తో కూడిన మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ అనే రెండు క‌ల‌ర్స్‌లో లభిస్తుంది.

(ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ ఆస్తుల విలువ అక్షరాలా..!)

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఈ బైకులో ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్‌లు అమర్చబడి ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది.

(ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ స్టార్ 'రామ్ చరణ్' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)

మరిన్ని వార్తలు