సరికొత్తగా మహీంద్రా "థార్''

15 Aug, 2020 13:38 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర ఎట్టకేలకు సరికొత్త థార్‌ను ఆవిష్కరించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా  తన ప్రతిష్టాత్మ ఎస్‌యూవీ "థార్'' ను దేశీయంగా తీసుకొచ్చింది. రెండు, మూడు సంవత్సరాల సుదీర్ఘ పరీక్షల అనంతరం  ఐకానిక్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో  శనివారం పరిచయం చేసింది. ఫ్రీడమ్ డ్రైవ్‌లో  భాగంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు  అందుబాటులోఉండనుందని తెలిపింది. ఫస్ట్-జెన్ మోడల్ కంటే  పెద్ద వాహనంగా తీసుకొస్తున్న ఈ కొత్త థార్ 2020 అక్టోబర్ 2న లాంచ్  చేయనుంది. ధర, ప్రీ బుకింగ్ వివరాలు కూడా అక్టోబర్ 2 న ప్రకటిస్తామని ఎంఅండ్ఎం వెల్లడించింది. 

సెకండ్ జెనరేషన్ థార్ వాహనంలో ప్రతీ కొత్తదిగానే ఉంటుందని ఎం అండ్ ఎం ప్రకటించింది. శక్తివంతమైన ఇంజీన్, టచ్‌స్క్రీన్ సామర్థ్యాలతో కొత్త 18 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌ను, ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లు, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 650 మిమీ వాటర్ వాడింగ్ సామర్ధ్యంలాంటి  ఫీచర్లను అమర్చింది.  ఇంకా డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్,  సెకండ్ జనరేషన్ థార్ టైట్రానిక్స్,  టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్,  హిల్ హోల్డ్,  హిల్ డీసెంట్ కంట్రోల్‌ను కూడా జోడించింది. కొత్త మహీంద్రా థార్  ఏఎక్స్,  ఎల్ ఎక్స్ సిరీస్ లో రెండు రంగుల్లో ఇది లభించనుంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్  150 హెచ్‌పీ, 320ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.  2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజీన్  130హెచ్‌పి,  320 ఎన్ ఎం టార్క్ ను ఇస్తుంది. 

>
మరిన్ని వార్తలు