భారత తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారు ఇదే..!

15 Sep, 2021 18:28 IST|Sakshi

ప్రముఖ బ్రిటిష్‌ కార్ల దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ భారత మార్కెట్లలోకి ఎమ్‌జీ ఆస్టర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీను అధికారికంగా ఆవిష్కరించింది. ఎమ్‌జీ ఆస్టర్‌ను ఈ పండుగ సీజన్‌లో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు టెస్ట్‌డ్రైవ్‌ కోసం సెప్టెంబర్‌ 19 నుంచి ఎమ్‌జీ మోటార్స్‌ కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అనేక ఆధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఎమ్‌జీ ఆస్టర్‌ సొం‍తం​.
చదవండి: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్‌ సంస‍్థ..!



కారు ఇంటిరియర్స్‌లో భాగంగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారు జియో ఈ-సిమ్‌తో  కనెక్టింగ్‌ సదుపాయాన్ని కలిగి ఉంది. కారులో ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత రోబోట్‌  వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్ ఆదేశాలతో సమాధానమిస్తుంది. వికీపీడియా, జోక్స్, న్యూస్, ఎమోజి, చిట్-చాట్, ఫెస్విల్లే గిఫ్ట్, నావిగేషన్, మ్యూజిక్ సెలెక్ట్, వంటి ఫీచర్‌లు కారులో ఉన్నాయి. 


ఎమ్‌జీ గ్లోస్టర్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలోని అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్(ఎడీఎఎస్‌) తో రానుంది.  ఎమ్‌జీ ఆస్టర్‌లో లేన్ చేంజ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌లను, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, వంటి భద్రతా ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

MG ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే
రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌  ఆప్షన్లతో రానుంది.  మొదటి వేరియంట్‌ 1.5-లీటర్ పెట్రోల్‌ ఇంజన్‌ 110 హెచ్‌పీ పవర్,  144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్‌ విషయానికి వస్తే ఆటో, మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో రానుంది.  రెండో వేరియంట్‌ 1.3లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో 140 హెచ్‌పీ సామర్థ్యంతో 220 టార్క్‌ను ఉత్పతి చేస్తోంది. ఈ వేరియంట్‌లో 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. 

చదవండి: Maruti Suzuki Swift : సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేసిన మారుతి

మరిన్ని వార్తలు