ఒక్క ఫొటోతో ఓలా హోలీ స్పెషల్ ఎడిషన్ మీ సొంతం: భవిష్ అగర్వాల్

11 Mar, 2023 14:59 IST|Sakshi

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ఇటీవల హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ తీసుకువచ్చింది. కంపెనీ ఈ స్కూటర్లను కేవలం 5 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ స్కూటర్ కావాలనుకునే వారు కేవలం హోలీ సెలబ్రేషన్స్ ఫోటో పెట్టి సొంతం చేసుకోవచ్చు.

హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ కేవలం ఎస్1 వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఎస్1 వేరియంట్‌కి ఉన్న డిమాండ్ కారణంగా దీనిని విడుదల చేయడం జరిగిందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్కూటర్ వివిధ రంగుల కలయికతో చూడటానికి కొత్తగా కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ)

ఓలా ఎస్1 హోలీ ఎడిషన్ ఖాకీ, గెరువా, నియో మింట్, మార్ష్‌మల్లో, కోరల్ గ్లామ్ వంటి కలర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 2 kWh వెర్షన్ 90 కిమీ/గం వేగంతో 90 కిలోమీటర్ల పరిధిని, 3 kWh వెర్షన్ 141 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. 

ఓలా ఎస్1 2 కిలోవాట్ వెర్షన్ ధర రూ. 90,000 కాగా 3 kWh వెర్షన్ ధర రూ. 1.08 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది, ఎటువంటి మార్పులు లేదు. డబ్బు చెల్లించకుండా కేవలం ఫోటో పెట్టి 5 యూనిట్లను మాత్రమే పొందవచ్చు, అంటే ఐదు మంది కస్టమర్లు మాత్రమే స్కూటర్లను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు