రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌లో సంచలనం..! ఏకంగా లక్ష మోడల్స్‌..!

3 Feb, 2022 12:54 IST|Sakshi

టూవీలర్‌ వాహనాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్‌ బండిని సొంతం చేసుకోవడానికి బైక్‌ లవర్స్‌ ఎగబడతారు. తాజాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు చెందిన న్యూ జనరేషన్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. 

లక్ష యూనిట్ల ఉత్పత్తి..!  
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ టూవీలర్స్‌ బైక్లలో బేసిక్‌ మోడల్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 నిలుస్తోంది. దీనికి కొత్త హంగులను జోడించి భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఇక లాంచ్‌ చేసిన ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటిన మోడల్‌గా న్యూ జనరేషన్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 నిలిచింది. భారత్‌లోనే కాకుండా న్యూ  క్లాసిక్ 350 థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కూడా క్లాసిక్‌ 350 డుగ్గు డుగ్గు మంటూ సౌండ్‌ చేస్తోంది. న్యూ జనరేషన్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 యూకేలో ఇంకా లాంచ్‌ కాకపోవడం విశేషం. 

అత్యధికంగా అమ్ముడైన మోడల్‌..!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌లో 350 సీసీ కేటాగిరిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలుస్తోంది.  ఇది కంపెనీలో 70 నుంచి 80 శాతం వాటాను కలిగి ఉంది. న్యూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌ను సెప్టెంబర్ 2021లో భారత్‌లో ప్రారంభించారు. 

అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌తో..!
కొత్త ఇంజన్, కొత్త ఛాసిస్, అప్‌డేటెడ్‌ సస్పెన్షన్, కొత్త వీల్స్, బ్రేక్‌తో మరింత ఆకర్షణీయంగా తయారైంది.  సరికొత్త క్లాసిక్ 350 అనేది మెటోర్ 350 మోడల్‌ బైక్‌ లాగే 350 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది.  349 cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను రిలీజ్‌ చేస్తోంది.

చదవండి: భారత్‌లో అమ్మేది కేవలం 20 బైక్స్‌ మాత్రమే..! ఈ బైక్‌ ఎందుకంత స్పెషల్‌ అంటే..!

మరిన్ని వార్తలు