అగ్నికి ఆహుతవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌, కేంద్రం కీలక నిర్ణయం!

2 Sep, 2022 20:02 IST|Sakshi

ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు భద్రతా అవసరాల కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల పరీక్ష ప్రమాణాలను సవరించింది. నిబంధనల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  
 
మార్చి - జూన్ మధ్య కాలంలో  దేశంలోని వివిధ ప్రాంతాలలో వినియోగదారుల ఈవీ వెహికల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రభుత్వం  ఈవీ వెహికల్స్‌ పరీక్ష ప్రమాణాలను సమీక్షించడానికి, వాటిని బలోపేతం చేసే చర్యలను సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

తాజాగా ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఈవీ టెస్టింగ్‌ ప్రమాణాల్ని మార్చాలని సిఫార్స్‌ చేస్తూ ఓ రిపోర్ట్‌ను అందించారు. ఆ రిపోర్ట్‌లో మంటలకు దారితీసే అంతర్గత సెల్ షార్ట్-సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్‌లు, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్‌), ఆన్‌బోర్డ్ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్ అదనపు భద్రతా అంశాలను ఇందులో పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలపై ప్రభుత్వం వాటాదారుల నుండి సలహాలను కూడా కోరింది.

మరిన్ని వార్తలు