అమలులోకి కొత్త రూల్‌.. ఆ సమయంలో ఎస్‌ఎంఎస్‌ సేవలు బంద్‌!

17 Nov, 2022 14:17 IST|Sakshi

ఎస్‌ఎంస్‌ల మోసాలను నివారించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) సేవలకు సంబంధించి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా టెలికాం ఆపరేటర్‌లను సిమ్ మార్పిడి లేదా అప్‌గ్రేడ్ ప్రక్రియలో ఎస్‌ఎంఎస్‌ (SMS) సౌకర్యాన్ని (ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రెండూ) నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త SIM కార్డ్‌లను యాక్టివేట్ చేసిన తర్వాత 24 గంటల పాటు ఎస్‌ఎంఎస్‌ (SMS) సేవలు నిలిపివేయాలని సూచించింది.

కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి..
కొత్త నిబంధన ప్రకారం, సిమ్ కార్డ్ లేదా నంబర్‌ను మార్చమని రిక్వెస్ట్‌ వచ్చిన తర్వాత, టెలికాం ఆపరేటర్లు కస్టమర్లకు అభ్యర్థనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా పంపాలి. సిమ్ కార్డ్ హోల్డర్ ఐవీఆర్‌ఎస్‌ ( IVRS ) కాల్ ద్వారా ఈ అభ్యర్థనను మరింత ధృవీకరించాలి. కస్టమర్ ఏదైనా సమయంలో సిమ్‌ కార్డ్ అప్‌గ్రేడ్ అభ్యర్థనను తిరస్కరిస్తే, వెంటనే దీన్ని నిలిపివేయాలి. సిమ్ స్విచ్ స్కామ్‌లు, ఇతర సంబంధిత సైబర్ నేరాలను తగ్గించేందుకు టెలికాం శాఖ ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి తెచ్చింది. వీటిని అమలు చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది.

చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా!

మరిన్ని వార్తలు