ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!

10 Nov, 2021 20:15 IST|Sakshi

ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్‌వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. 

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది.  పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్‌లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్‌ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్‌లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. 

Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది?
సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్‌లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది.

అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్‌ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది.

(చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు