న్యూహాలెండ్ అగ్రికల్చర్ కొత్త ట్రాక్టర్

29 Aug, 2020 10:32 IST|Sakshi

5620 టీఎక్స్ ప్లస్ సరికొత్త ట్రాక్టర్ విడుదల లాంచ్

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ పనిముట్ల సంస్థ న్యూహాలెండ్ అగ్రికల్చర్ (సీఎన్ హెచ్ ఇండస్ట్రియల్  బ్రాండ్) సరికొత్త 5620 టిఎక్స్ ప్లస్ ట్రాక్టర్‌ని  లాంచ్ చేసింది. ఈ క్రొత్త 65 హెచ్ పీ 5620 టిఎక్స్ ప్లస్ అద్భుతమైన ట్రాక్టర్ నూతన వ్యవసాయ సాంకేతికతల ఆధారంగా రూపొదించినట్టు తెలిపింది.

విశిష్టతలు  ప్రత్యేకతలు
ఈ నవతరపు ట్రాక్టర్‌కి అత్యాధునికమైన ఎఫ్ పి టి ఇంజన్ ను అమర్చింది. మెరుగైన ఇంధన సామర్ధ్యం, పవర్, టార్క్ విశిష్టతలు దీని సొంతం. డ్యూయల్ క్లచ్ సిస్టం,  పవర్ స్టీరింగ్ ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్  ఫ్యాక్టరీ ఫిట్టేడ్ ఆర్ఓపిలు అండ్ కేనోపీ ప్రధాన ఆకర్షణ. న్యూహాలెండ్ 5620 టిఎక్స్ ఒక ఆధునిక సీట్, ఫ్లాట్ ఫ్లోర్, ఆధునిక డిజిటల్ కంట్రోల్ ప్యానెల్  మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుంది. దీంతోపాటు ఈ ట్రాక్టర్  చక్కని స్టైలింగ్ , అద్భుత డిజైన్  విశేషంగా నిలుస్తోంది.  స్కై వాచ్ ఈజీ తో ట్రాక్టర్‌ని ప్రో-యాక్టివ్ అలర్ట్స్ ద్వారా ట్రాక్  ట్రేస్ చేసుకోవచ్చు. అలాగే 24 సెన్సింగ్ పాయింట్స్ అన్నిరకాల నేలల్లోనూ అందించే మెరుగైన సెన్సింగ్తో మరింత ఇంధనం పొదుపు అవుతుందని కంపెనీ తెలిపింది.

మరికొన్ని ఇతర ఇన్ బిల్ట్ విశిష్టతలు:
హెవీ డ్యూటీ 12+3 యూజీ గేర్ బాక్స్
ఇండిపెండెంట్  పీటీవో క్లచ్ లీవర్
అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్
సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారం
ఫ్రంట్ వెయిట్ క్యారియర్ 55 కేజి
న్యూట్రల్ సేఫ్టీ స్విచ్
క్లచ్ సేఫ్టీ లాక్
ట్రాన్స్మిషన్ కవర్
60 లీటర్ల ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్

అత్యుత్తమ విశిష్టతలు, సాంకేతిక లక్షణాలుతో క్రొత్త ట్రాక్టర్ ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని  సీఎన్ హెచ్ ఇండస్ట్రియల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ తరుణ్ ఖన్నా తెలిపారు. ఇది రైతు సోదరులకు డీలర్లకు బాగా నచ్చుతుందనటంలో సందేహం లేదని, ఈ క్రొత్త మెషీన్ డిజైన్ వ్యవసాయ కార్యకలాపాలు మరింత తక్కువ అలసటతో,  ఎక్కువ ఉత్పాదకతతో జరిగేలా సాయపడుతుందన్నారు. 

మరిన్ని వార్తలు