టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ లాభం డౌన్‌

18 Jan, 2023 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ: మీడియా కంపెనీ టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 87 శాతం పతనమై రూ. 38 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 312 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,768 కోట్లకు చేరింది.

గతేడాది క్యూ3లో రూ. 1,567 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,813 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ షేరు బీఎస్‌ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 36.5 వద్ద ముగిసింది. 

చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారో తెలుసా?

మరిన్ని వార్తలు