సింగిల్‌ ట్రాన్సాక్షన్‌లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!

3 Apr, 2023 11:05 IST|Sakshi

సాక్షి, ముంబై: ట్రేడింగ్‌ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్  ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి.  అలా  క్రిప్టో లావాదేవాల్లో  చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్‌ఎఫ్‌టీలని  కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా  ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. 

వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్‌ఎఫ్‌టీ కలెక్టర్‌.   ఈక్రమంలో  CryptoPunk #685  అనే NFTని 77 ఈథర్‌లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు  కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని  ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం  మార్కట్‌ ప్లేస్‌లో ర్యాపింగ్‌ (ర్యాపింగ్అంటే ఓపెన్‌సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్‌ప్లేస్‌లలో NFTల ట్రేడింగ్‌) చేసే సమయంలో  పొరపాటున బర్న్‌ ఎడ్రస్‌కి షేర్‌చేశాడు.  (బర్న్‌ ఎడ్రస్‌ కి  చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్‌లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్‌కి చేరితే సంబంధిత ఎన్‌ఎఫ్‌టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది.

తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్‌డ్‌ నెట్‌ వర్క్‌ ఎలా పనిచేస్తుందో  అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. 

మరిన్ని వార్తలు