భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ బ్లాక్‌బస్టర్‌ ఇయర్‌ ఎండ్‌

31 Dec, 2021 16:11 IST|Sakshi

ముంబై: ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. బ్యాంకింగ్​, ఆటో, లోహ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ సహా అన్ని రంగాల షేర్లు రాణించడం వల్ల సూచీలు 2021 ఏడాదిలో చివరి సెషన్​ను సానుకూలంగా ముగించాయి. మరోవైపు వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు అమలును వాయిదా వేయడం కూడా కలిసి వచ్చింది. చివరకు, సెన్సెక్స్ 459.50 పాయింట్లు(0.80%) పెరిగి 58,253.82 వద్ద ఉంటే, నిఫ్టీ 150 పాయింట్లు(0.87%) లాభపడి 17,354 వద్ద ఉంది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా లాభపడితే.. ఎన్‌టీపీసీ, సిప్లా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్, ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్‌యు బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-2 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాలతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి.

(చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’)

మరిన్ని వార్తలు