భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

1 Dec, 2021 16:01 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అదే జోరును కొనసాగించాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయిన మార్కెట్లు దేశ వృద్ధి రేటు అంచనాలు సానుకూలంగా ఉండటంతో తిరిగి వేగంగా పుంజుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లుగా నమోదు కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదు కావడం భాగ కలిసి వచ్చింది. దీంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.

చివరకు, సెన్సెక్స్ 619.92 పాయింట్లు (1.09%) పెరిగి 57,684.79 వద్ద ఉంటే, నిఫ్టీ 183.70 పాయింట్లు(1.08%) లాభపడి 17,166.90 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.91 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను పొందాయి. ఎక్కువగా నష్టపోయిన వాటిలో సీప్లా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా ఉన్నాయి. ఫార్మా మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడటంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.

(చదవండి: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!)

మరిన్ని వార్తలు