నిఫ్టీ రికార్డ్ !... ఆల్‌టైం హై టచ్‌

11 Oct, 2021 12:11 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌లో మరో సంచలనం నమోదైంది. నేషనల్‌ స్టాక్‌ ఏక్సేంజీ సూచీ నిఫ్టీ ఆల్‌టైం హై పాయింట్లను తాకింది. మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతుండటంతో సోమవారం 18 వేల మార్క్‌ని టచ్‌ చేసింది. 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ రోజు ఉదయం 17,867 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ 17,839 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. కానీ ఆ వెంటనే కోలుకుంది. ఉదయం 9:30 గంటల నుంచి నిఫ్టీ సూచీ పాయింట్లు పెరుగుతూనే పోయింది. అలా మధ్యాహ్నం 12 గంటల సమయంలో 67 పాయింట్లు లాభపడి ఆల్‌టైం హైకి చేరుకుని 18,000 పాయిం‍ట్లను టచ్‌ చేసింది. 

ఐటీ షేర్ల అండతో నిఫ్టీ సునాయాసంగా 18వేల మార్క్‌ని అందుకుంది. ఈరోజు ఉదయం టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ షేర్లు ఆరంభంలో నష్టపోయాయి. కానీ ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లపై నమ్మకం చూపించడంతో నష్టాల నుంచి కొలుకుని లాభాల బాట పట్టాయి. ఈ షేర్ల దన్నుతో నిఫ్టీ 18 వేల పాయింట్లను క్రాస్‌ చేసింది. మరోవైపు చైనా, జపాన్‌తో పాటు అమెరికాలో మార్కెట్‌లో సైతం మంచి ఫలితాలు రావడం నిఫ్టీకి కలిసొచ్చింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు