లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

17 May, 2021 17:12 IST|Sakshi

ముంబై: గత వారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే తీరును కనబరిచాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కోవిడ్ కేసులు తగ్గు ముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకోవడం మదుపర్లకు ధైర్యాన్ని కలిగించాయి. ఉదయం 48,990 పాయింట్ల వద్ద ప్రారంభించిన సెన్సెక్స్ 49,628 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగిసింది. ఇక, 14,756 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ 14,938 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి చివరకు 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. 

అంతర్జాతీయ సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లకు చైనా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు తోడవ్వడంతో నేడు లాభాల్లో పయనించాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభాల్లో ముగిస్తే.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, మారుతీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

చదవండి:

వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం!

>
మరిన్ని వార్తలు