బుల్ జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..!

9 Mar, 2022 15:49 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ముగింపు వరకు అదే జోరును కొనసాగించాయి. ఆటో, బ్యాంకు, క్యాపిటల్​ గూడ్స్​, ఫార్మ, ఐటీ రంగ షేర్ల అండతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉక్రెయిన్​- రష్యా యుద్ధ భయాలు ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేసిన ప్రకటన మార్కెట్‌లో కొత్త ఆశలు నింపింది. 

ముగింపులో, సెన్సెక్స్ 1,223.24 పాయింట్లు(2.29%) పెరిగి 54,647.33 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 331.90 పాయింట్లు(2.07%) లాభపడి 16,345.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.54 వద్ద ఉంది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంకుల షేర్లు భారీ లాభాలతో ముగిస్తే.. శ్రీ సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని క్యాపిటల్ గూడ్స్, ఆటో & రియాల్టీ సెక్టోరల్ సూచీలు 2-3 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి.

(చదవండి: గృహిణులకు యాక్సిస్‌ బ్యాంక్‌ తీపికబురు..!)

మరిన్ని వార్తలు