వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

21 Dec, 2021 16:03 IST|Sakshi

ముంబై: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ భయాందోళనల నడుమ గ్లోబల్‌ మార్కెట్‌ నిన్నంతా(డిసెంబర్ 20) భారీ నష్టాల్ని చవిచూసిన సూచీలు.. నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా కిందకు జారుకున్నాయి. ఆ తర్వాత రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలకు అండగా నిలవడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది. చివరకు, సెన్సెక్స్ 497 పాయింట్లు(0.89%) పెరిగి 56,319.01 వద్ద ఉంటే, నిఫ్టీ 156.60 పాయింట్లు(0.94%) పెరిగి 16,770.80 వద్ద ముగిసింది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.60 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, యుపిఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు ఎక్కువ లాభపడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సీప్లా, ఎస్‌బీఐ షేర్లు ఎక్కువ నష్టపోయాయి. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, మెటల్ సూచీలు 1-3 శాతం పెరగడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

(చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!)

మరిన్ని వార్తలు