వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

23 Dec, 2021 16:11 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో చివర వరకు అదే జోరును కనబరిచాయి. ఓమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ముప్పు తక్కువగా ఉండటం చేత సూచీలు లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 384.72 పాయింట్లు(0.68%) పెరిగి 57,315.28 వద్ద నిలిస్తే, నిఫ్టీ 117.10 పాయింట్లు(0.69%) లాభపడి 17,072.60 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.24 వద్ద ఉంది. 

నేడు నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీఎల్, ఒఎన్‌జీసీ, ఐటీసీ, సిప్లా షేర్లు ఎక్కువగా లాభపడితే.. జే.ఎస్.డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు అధికంగా నష్టపోయాయి. మెటల్ మినహా, అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు పిఎస్‌యు బ్యాంకు, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం పెరిగాయి.

(చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!)

మరిన్ని వార్తలు