భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

7 Dec, 2021 16:04 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆటో, మెటల్, రియాల్టీ & ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో బుల్ పరుగు అందుకుంది. ఆసియా మార్కెట్లు కూడా నేడు లాభాలతో ముగిశాయి. నిన్నటి(నవంబర్ 12) భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇక రేపు జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో రేట్ల పెంపు ఏమీ ఉండకపోచ్చునన్న సంకేతాలూ సెంటిమెంటును పెంచాయి. దీంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.

చివరకు, సెన్సెక్స్ 886.51 పాయింట్లు(1.56%) పెరిగి 57,633.65 వద్ద ఉంటే, నిఫ్టీ 264.40 పాయింట్లు (1.56%) లాభపడి 17,176.70 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.75.43 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు భారీగా లాభపడితే.. ఎక్కువ నష్టపోయిన వాటిలో సిప్లా, బ్రిటానియా ఇండస్ట్రీస్, దివిస్ ల్యాబ్స్, ఐఓసీఎల్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. అన్ని బ్యాంక్, మెటల్, రియాల్టీ సెక్టోరల్ సూచీలు 2-3 శాతం లాభాలతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.

(చదవండి: Bounce Infinity E1 vs Ola S1: ఈ రెండింటిలో ఏది బెటర్..?)

>
మరిన్ని వార్తలు