భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!

22 Mar, 2022 16:06 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నాయి. విదేశీయ సంస్థాగత మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగడం,  అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్‌ భరోసా ఇవ్వడం నేడు మార్కెట్లకు సానుకూలాంశంగా కనిపిస్తోంది.

దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్‌ ధరల్ని, అలాగే వంటగ్యాస్ ధరలు పెంచిన మార్కెట్లు దూసుకెళ్లడం గమనర్హం. రిలయన్స్​, ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 696.81 పాయింట్లు(1.22 శాతం) పెరిగి 57,989.30 వద్ద నిలిస్తే, నిఫ్టీ 197.90 పాయింట్లు(1.16 శాతం) లాభపడి 17,315.50 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద ఉంది.

టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్​ మోటార్స్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. బీఎస్​ఈ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి.

(చదవండి: టాటా మోటార్స్‌ షాకింగ్‌ నిర్ణయం..!)

మరిన్ని వార్తలు