Stock market: ఎట్టకేలకు వరుస నష్టాలకు బ్రేక్‌!

23 Nov, 2021 16:13 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిగా తడబడిన బేర్‌ పట్టు నుంచి తప్పించుకొని సుమారు 200 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య సూచీలు నష్టాల్లోకి వెళ్లడంతో కనిష్ఠ ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాల వైపు అడుగువేశాయి. ముఖ్యంగా రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. అలాగే ఇటీవల లిస్టయి భారీ నష్టాలు చవిచూసిన పేటీఎం, ఫినోపేమెంట్స్‌ షేర్లు సైతం నేడు లాభాల బాట పట్టాయి.

చివరకు, సెన్సెక్స్ 198.44 పాయింట్లు (0.34%) పెరిగి 58,664.33 వద్ద నిలిస్తే, నిఫ్టీ 86.80 పాయింట్లు (0.50%) పెరిగి 17,503.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.41 వద్ద ఉంది. జెఎస్ డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ షేర్లు నిఫ్టీలో భారీగా లాభాలను పొందితే.. నష్టపోయిన వాటిలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, విప్రో ఉన్నాయి. ఐటీ మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి, పవర్, మెటల్, రియాల్టీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్‌యు బ్యాంకు సూచీలు 1-3 శాతం పెరిగాయి. 

(చదవండి: వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు భారీ షాక్!)

మరిన్ని వార్తలు