బుల్ జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

5 Oct, 2021 16:18 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య కొద్ది సేపు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆ తర్వాత  ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో సూచీలకు అండ లభించింది. ఇక గతవారం మార్కెట్ భారీగా నష్టపోవడంతో మదుపర్లు కొన్ని కీలక రంగాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో చివరకు మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. ముగింపులో, సెన్సెక్స్ 445.56 పాయింట్లు (0.75%) పెరిగి 59,744.88 వద్ద ఉంటే, నిఫ్టీ 131 పాయింట్లు (0.74%) లాభపడి 17,822.30 వద్ద ముగిసింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!)

నేడు సుమారు 2025 షేర్లు అడ్వాన్స్ అయితే, 1184 షేర్లు క్షీణించాయి, 154 షేర్లు మారలేదు. డాలరుతో రూపాయి మారకం విలువ 74.51గా ఉంది. నిఫ్టీలో ఓఎన్ జీసీ, ఇండస్ సిండ్ బ్యాంక్, కోల్ ఇండియా, ఐఓసీ, భారతి ఎయిర్ టెల్ షేర్లు రాణిస్తే.. సిప్లా, హిందాల్కో, శ్రీ సిమెంట్స్, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ షేర్లు భారీగా నష్టపోయాయి. పిఎస్‌యు బ్యాంకు, రియాల్టీ,  ఫార్మా మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు చమురు & గ్యాస్, విద్యుత్, ఐటీ సూచీలు 1-3 శాతంతో లాభాలతో ముగిశాయి. 

మరిన్ని వార్తలు