జోరందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు!

12 Nov, 2021 16:13 IST|Sakshi

ముంబై: మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​, నిఫ్టీ.. కొద్దిసేపు నష్టాల్లో ట్రేడ్​ అయ్యాయి. ఆ తర్వాత వెంటనే బలంగా పుంజుకున్నాయి. గత మూడు రోజులుగా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే, ఐటీ, పవర్, రియాల్టీ స్టాక్స్ అండతో నిఫ్టీ 18000 పాయింట్లను అధిగమించింది.

చివరకు, సెన్సెక్స్ 767.00 పాయింట్లు (1.28%) పెరిగి 60,686.69 వద్ద ఉంటే, నిఫ్టీ 229.20 పాయింట్లు (1.28%) పెరిగి 18,102.80 వద్ద ముగిసింది. నేడు దాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.43 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్, విప్రో, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా లాభపడితే.. బజాజ్ ఆటో, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఐఓసీఎల్ షేర్లు నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఐటీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. 

(చదవండి: అదిరిపోయిన ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్)

మరిన్ని వార్తలు