బుల్ జోరు.. జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు!

18 Oct, 2021 16:06 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, కీలక సంస్థల త్రైమాసిక ఫలితాలతో జీవితకాల గరిష్ఠాలను తాకాయి. గతవారం విడుదలైన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, డి-మార్ట్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ త్రైమాసిక ఫలితాలు మెప్పించటం వల్ల పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపారు. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్‌, పవర్ స్టాక్స్ మద్దతుతో నేడు లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 459.64 పాయింట్లు (0.75%) పెరిగి 61,765.59 వద్ద ముగిస్తే, నిఫ్టీ 138.50 పాయింట్లు (0.76%) పెరిగి 18,477 వద్ద ఉంది. 

నేడు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.33 వద్ద ఉంది. అలాగే, నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఇన్ఫోసీస్, టెక్ మహీంద్రా, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ నిఫ్టీలో భారీగా లాభాలను పొందితే.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ షేర్లు భారీగా క్షీణించాయి. ఫార్మా మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు మెటల్ పవర్, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు 2-4 శాతం పెరగడంతో సూచీలు లాభాలలో ముగిశాయి.

(చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్​ను కోరిన శ్రీలంక!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు