అమ్మకాల సెగ : 11150 దిగువకు నిఫ్టీ

27 Jul, 2020 16:04 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి  వెంటనే పతనమై డే హై నుంచి దాదాపు 500 పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు రోజంతా భారీ ఒడిదుడుకుల మధ్య సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 194 పాయింట్లు  నష్టంతో 37943​ వద్ద, నిఫ్టీ  62 పాయింట్లు నష్టంతో 11131 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్‌ 38 వేల దిగువన, నిఫ్టీ 11150 స్థాయిని కోల్పోయింది.

ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోగా, బంగారం సంబంధిత షేర్లులాభాల్లో ముగిసాయి. మరోవైపు ఐటీ, పెయింట్‌, సిమెంట్‌ రంగ షేర్లు  లాభపడ్డాయి.  ఆసియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటాస్టీల్‌ భారీగా లాభపడ్డాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌,ఎస్‌బీఐబ్యాంకు,బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మ, గెయిల్‌ భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది.  74.70 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి 74.83 వద్ద ముగిసింది.  (ప్రపంచంలోనే నెంబర్‌ 2 సంస్థగా రిలయన్స్‌)

మరిన్ని వార్తలు